ఇలాంటి పార్ట్‌‌‌‌నర్స్ వద్దే వద్దు

ప్రేమ చాలా అందమైన ఫీలింగ్‌‌‌‌. దాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం.  మనం ఒకరి పనులు, అభిప్రాయాల్ని మెచ్చుకున్నప్పుడు.. నెమ్మదిగా వాళ్లపై మనకు ఇష్టం పెరుగుతూ పోతుంది. వాళ్లపై కొంచెం కొంచెంగా ఫీలింగ్స్ పెరిగి..  ప్రేమలో పడతాం.  ఆ ప్రేమ మనసుకు ఓదార్పును ఇస్తుంది. హెల్దీ అట్మాస్ఫియర్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్ చేస్తుంది. కాలంతో పాటు వాళ్లతో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఆ వ్యక్తి తాలూకు ఊహించని మరో కోణం కూడా బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది.. ఆ రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌కి రెడ్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇవ్వాలా? లేక గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా? అని.

ప్రేమ పుట్టడం గొప్ప విషయం కాదు. కానీ, అది కలకాలం నిలవాలంటే.. ఇద్దరి మనసులూ కలవాలి. ఒక మనిషితో కలిసి కొన్నాళ్లు  ట్రావెల్ చేస్తేగానీ, వాళ్లది ఎలాంటి ప్రేమో తెలియదు. ఆకర్షణలో అన్నీ మంచిగా అనిపించినా.. అది ప్రేమ కాదు అని అర్థం కావడానికి ఎక్కువ టైమ్ ఏం పట్టదు. ప్రేమ అనే లైన్‌‌‌‌లో కొన్ని మిస్టేక్స్‌‌‌‌ చేస్తే.. జీవితానికి ఎండ్‌‌‌‌కార్డ్ పడ్డట్టే. ప్రేమలో పడ్డా సరే.. ఒకవేళ  ఈ ఐదు రకాల పార్ట్‌‌‌‌నర్స్‌‌‌‌ని రియలైజ్ అయ్యారు  అంటే..  కచ్చితంగా మనం వాళ్లను దూరం పెట్టాల్సిందే. అంటే వీళ్లు మనకు సరైన జోడి కాదు అని అర్థం.

ఎమోషనల్లీ ఎబ్యూజివ్‌‌‌‌

ముందుగా రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌ పూల దారిలాగ కనిపించొచ్చు. ఒకరి గురించి మరొకరు కేర్‌‌‌‌‌‌‌‌గా ఉండొచ్చు. కొన్ని మర్చిపోలేని మూమెంట్స్‌‌‌‌ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ, కొన్నాళ్లకు కోపం తాలూకు సమస్యలు తలెత్తుతాయి. చిన్న విషయానికే కోప్పడటం, బ్లేమ్‌‌‌‌గేమ్ స్టార్ట్ చేయడం లాంటివి పార్ట్‌‌‌‌నర్ మొదలుపెడితే.. ఒక్కొక్క సమస్య మన జీవితంలోకి క్యూ కడుతుంది. ఇలాంటి మనుషులు ఎమోషనల్‌‌‌‌గా మ్యానిప్యులేట్ చేస్తుంటారు. విసుగొచ్చి ‘నేను నీతో ఉండలేను’ అన్నప్పుడు ఎమోషనల్‌‌‌‌గా ‘నేను చచ్చిపోతాను’ అని బెదిరిస్తుంటారు వీళ్లు. అయితే, ఎక్కువ ఎమోషనల్‌‌‌‌ లేదా తక్కువ ఎమోషనల్ వ్యక్తులు అయ్యుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌కి దూరమవ్వడం మంచి నిర్ణయమే అవుతుంది.

నిజంగా మనతో ఉంటున్నారా?

‘ ఐ లవ్‌‌‌‌ యూ’ అని డైలీ చెప్తూనే ఉంటారు. కానీ, వాళ్లు చేసే పనుల్లో మాత్రం ఆ ప్రేమ కనిపించదు. ఇలాంటి వ్యక్తుల గురించి క్లియర్‌‌‌‌‌‌‌‌గా తెలుసుకోవాలి. రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో కేవలం ప్రేమ అనే పదాన్నే కాదు. నమ్మకం, సపోర్ట్‌‌‌‌, అండర్‌‌‌‌‌‌‌‌స్టాండింగ్‌‌‌‌ లాంటి విషయాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మనకు సాయం అవసరం ఉందని తెలిసి కూడా అర్థం చేసుకోకుండా, ఇతర విషయాలతో బిజీగా ఉండే పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ని… రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో బ్యాడ్ సైన్‌‌‌‌గానే భావించాలి. మనతో కాకుండా రోజూ వాళ్ల ఫ్రెండ్స్‌‌‌‌తో, ఇతరులతో ఎక్కువ టైమ్‌‌‌‌ స్పెండ్ చేస్తున్నారు అంటే, వాళ్లను వదిలేసే టైమ్‌‌‌‌ వచ్చిందనే అర్థం.

స్వార్థంగా ఆలోచించేవాళ్లు

ఏ విషయంలోనైనా సరే.. పార్ట్‌‌‌‌నర్ ప్రతిసారి మనల్ని అర్థం చేసుకోనట్టు అనిపిస్తుంది అంటే.. వాళ్లు ఎప్పుడూ వాళ్ల గురించి వాళ్లే ఆలోచించుకుంటున్నారని అర్థం. ఇలా సెల్ఫిష్‌‌‌‌గా ఉండేవాళ్ల వల్ల రిలేషన్‌‌‌‌షిప్ నెగెటివ్‌‌‌‌ టర్న్ తీసుకుంటుంది. రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇద్దరి కంట్రిబ్యూషన్ సమానంగా ఉండాలి. అప్పుడే అది బంధానికి గట్టి పునాదులు వేస్తుంది. ఇలా సెల్ఫిష్‌‌‌‌గా ఉంటూ.. రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో అసంతృప్తికరమైన కంట్రిబ్యూషన్ చేస్తుంటే వాళ్లను.. ‘పూర్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్స్‌‌‌‌’గా పరిగణిస్తారు. ఒకవేళ మనం నిరంతరం పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ని పొగుడుతూనే ఉంటూ.. మనకంటే ఎక్కువగా వాళ్లనే కేరింగ్ చూసుకుంటూ ఉంటుంటాం. మనం ఇవ్వడమే కానీ, ఎదుటివాళ్ల నుంచి తిరిగి ఏమీ రాదు. ఇలా రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో  కేవలం ఇవ్వడం ఒకటే ఉన్నప్పుడు.. జీవితంలో ఏమీ మిగలదు. చివరికి ప్రేమ కూడా!

ఎమోషన్స్​కు దూరంగా

మాటలు.. అంటే కొన్ని వేల ఎమోషన్స్‌‌‌‌ని అవి మోసుకొస్తాయి. తమ ఎమోషన్స్‌‌‌‌నీ, ఫీలింగ్స్‌‌‌‌ని మాటల్లో ఎక్స్‌‌‌‌ప్రెస్ చేయలేని పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ వల్ల.. రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతుంది. ఎమోషనల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ లేనివాళ్లు, సానుభూతి లేనివాళ్లు, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేనివాళ్లు మన మెంటల్ స్టేట్‌‌‌‌ని నాశనం చేస్తారు. రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇలాంటి వ్యక్తులను విడిచిపెట్టినందుకు ఎప్పుడూ గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు.

ఫైనల్‌‌‌‌గా చెప్పేదేమంటే ఎవరికైనా సరే.. తనకు తాను లేకపోతే.. ఎవరు ఉన్నా వృథానే! మంచి పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ అంటే.. ముందుగా మనల్ని  మనలాగ ఉండనివ్వాలి. కాబట్టి,  మన పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ మనకూ, మన ఎమోషన్స్‌‌‌‌కి ప్రయారిటీ ఇవ్వకుంటే.. అలాంటి బంధం ఉంటేనేం? లేకుంటేనేం?

వాళ్ల తప్పును ఒప్పుకోనివాళ్లు

ఏ మనిషి అయినా సరే తప్పులు చేయడం సహజం. కానీ, చేసిన తప్పుల్ని ‘అవును నేనే చేశాను’ అని ఒప్పుకోరు కొంతమంది.  అలా  పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ రిపీటెడ్‌‌‌‌గా తప్పులు చేస్తూ కూడా తన తప్పుల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఫ్రస్ట్రేషన్ కలుగుతుంది.  ఇలాంటి వ్యక్తులు ప్రతీది తమకే తెలుసు అనుకుంటారు. ఎదుటివాళ్లకు ఏమీ తెలియదని, తెలిసినా.. అది రైట్‌‌‌‌ కాదని వీళ్ల ఫీలింగ్‌‌‌‌. లైఫ్‌‌‌‌లాంగ్ ఇలాంటి వ్యక్తులతో ఉంటే.. మన శక్తి, ఓపిక రెండూ నశించిపోతాయి.  దీని ఫలితం.. బలవంతంగా బంధం నుంచి బయటపడక తప్పదు.

Latest Updates