చైనా సైనికులకు ఆయుధాలను మనమే కొనిస్తున్నం

‘చైనా తయారీ’ మనకొద్దు

యాప్‌లు, వస్తువులు కొనొద్దు

టిక్ టాక్ తో రూ. కోట్లు ఇస్తున్నం
ఆ డబ్బుతోనే చైనా సైన్యానికి ఆయుధాలు
వాలెట్‌తో కూడా ఫైట్ చేయొచ్చు
మెగసెసె అవార్డు విన్నర్ సోనమ్ వాంగ్చుక్

న్యూఢిల్లీ: ‘బోర్డర్​లో మన సైనికులపైకి ఎక్కుపెట్టేందుకు చైనా సైనికులకు మనమే ఆయుధాలను కొనిస్తున్నం.. చైనా వస్తువులు కొంటూ, టిక్​ టాక్​ వంటి యాప్​లు వాడుతూ చైనాకు వందల కోట్ల రూపాయలు ఆర్జించిపెడ్తున్నం.. వీటి ద్వారా వచ్చిన డబ్బులతోనే చైనా ఆయుధాలను కొని, తన సైనికులకు ఇచ్చి బోర్డర్​కు పంపుతోంది. అందుకే మేడ్​ ఇన్​ చైనా వస్తువులను బ్యాన్​ చేయండి’ అంటూ ఇన్నోవేటర్, మెగసెసె అవార్డు గ్రహీత​ సోనమ్​ వాంగ్చుక్​ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన లడఖ్​లో ఓ వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టడంతో ఇప్పుడది వైరల్​గా మారింది. ఇందులో వాంగ్చుక్​ మాట్లాడుతూ.. చైనాపై బుల్లెట్​తోనే కాదు వాలెట్​తోనూ యుద్ధం చేయొచ్చని చెప్పారు. చైనాలో తయారైన తన మొబైల్​ ఫోన్​ను వారం రోజుల్లో, వచ్చే ఏడాదిలోగా మేడిన్​ చైనా వస్తువులను అన్నింటినీ వదిలించుకుంటానని వాంగ్చుక్​ వివరించారు. జాతీయ గీతం వినబడితే సినిమా హాల్లో కూడా లేచి నిలబడే సంస్కారం కేవలం మన దేశ ప్రజల్లో మాత్రమే చూశానని ఆయన వివరించారు. ఇప్పుడు మన దేశభక్తిని నిరూపించుకునే టైమొచ్చిందని, బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ చైనా వస్తువులను బ్యాన్​ చేయాలని ఆయన కోరారు. ‘ మేడ్​ ఇన్​ చైనా వస్తువులను మీరు వదుల్చుకోవడంతో పాటు మరో వంద మందికి చెప్పండి’ అని విజ్ఞప్తి చేశారు. బోర్డర్​లో చైనాను మన సైనికులు ఎదుర్కొంటరు.. వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తరు, మీ వంతుగా మీరు కూడా చైనాపై ఫైనాన్షియల్​గా ఫైట్​ చేయాలని చెప్పారు. దేశంలోని వివిధ సిటీల్లో ఉన్న మనమంతా సైనికులకు మద్ధతుగా చైనాపై వాలెట్​తో పోరాడాలని వాంగ్చుక్​ కోరారు. దేశంలోని 13‌‌0 కోట్ల మంది జనమంతా చైనా వస్తువులను కొనడం మానేస్తే, దీనిని ఓ ఉద్యమంగా చేస్తే… అది ప్రపంచంలోని ఇతర దేశాలకూ పాకుతుందని అన్నారు. దీనివల్ల మన దేశంలోని పరిశ్రమలు నిలదొక్కుకుంటాయని, మన కార్మికులు బాగుపడతారని వాంగ్చుక్​ తెలిపారు.

For More News..

9 రైళ్లలో 13 వేల మంది సొంతూర్లకు..

Latest Updates