బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించరాదు

ఈస్టర్ పండుగ సందర్భంగా కొలంబోలో జరిగిన పేలుళ్ల ఘటన తర్వాత శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం విధించింది. ముఖానికి ఎవరూ ఎటువంటి ముసుగూ ధరించరాదని స్పష్టం చేసింది. ఈస్టర్ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్లతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు(సోమవారం) నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన స్పష్టం చేశారు. సైనిక బలగాలకు తనిఖీకి ఎలాంటి ఆటంకం లేకుండి.. నిందితులను గుర్తించేందుకే బుర్ఖాపై నిషేధం నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అన్ని రకాల ముసుగులను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

Latest Updates