శానిటైజర్ ఎలా వాడాలో తెలుసా?

చేతులపై ఉన్న కరోనా వైరస్ ను చంపాలంటే శానిటైజర్ రాసుకోవాలనే సంగతి తెలిసిందే. అందుకే ప్రస్తుత కాలంలో శానిటైజర్ వాడటం తప్పనిసరైంది. అయితే దీని పనితీరు విషయంలో ఇప్పటికీ చాలా మందికి సరైన అవగాహన లేక పొరపాట్లు చేస్తున్నారని నిపుణులు చెప్తున్నారు.  కొంతమంది మాస్క్ పెట్టుకోవడానికి బదులు, ముక్కు, నోటి చుట్టూ , కళ్ల దగ్గరా శానిటైజర్ రాసుకుంటున్నారు. అయితే ఇది బాడీ సర్ఫేస్ పైన మాత్రమే పనిచేస్తుంది. ఇది ముక్కులోకి, నోటిలోకి వెళ్లే వైరస్ ని చంపలేదు. అలాగే చేతులపై లేదా బాడీపై ఎక్కడైనా దుమ్ము, ధూళి, జిడ్డు ఉంటే వైరస్ ను చంపలేదు. ఇలాంటి సర్ఫేస్ పై వైరస్ పనిచేయదు. చేతులపై లేదా ఎక్కడైనా శానిటైజర్ రాసుకోవాలంటే ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత బాడీ పూర్తిగా ఆరిపోయిన తర్వాతే శానిటైజర్ రాయాలి. అలాగే తడిగా ఉన్న ప్రదేశాలపై కూడా ఇది పనిచేయదు. చేతులు కడుక్కుని, తుడుచుకోకుండా శానిటైజర్ రాసుకున్నా ఉపయోగం లేదు. పొడిగా ఉన్న సర్ఫేస్ పై మాత్రమే వైరస్ ను చంపగలదు. అందులోనూ క్వాలిటీ శానిటైజర్ వాడితేనే బెటర్.

Latest Updates