ఇండియాలో పాపులర్ అయిన ఈ బ్రాండ్స్ చైనావేనని తెలుసా?

న్యూఢిల్లీ: ఇండో-చైనా బార్డర్ వివాదం నేపథ్యంలో చైనా గూడ్స్, బ్రాండ్లపై అందరి దృష్టి పడింది. గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఇండియాలో పాపులర్ అయిన చాలా బ్రాండ్స్ చైనా యాజమాన్యానికే చెందినవి కావడం గమనార్హం. సదరు కంపెనీల్లో డ్రాగన్ కంపెనీలు వాటాలను కొనడం ద్వారా ఓనర్‌‌షిప్ బాధ్యతలు చూసుకుంటున్నాయి. మరి ఆయా పాపులర్ బ్రాండ్లు, వాటిల్లో చైనా కంపెనీల భాగస్వామ్యం వివరాల గురించి తెలుసుకుందాం..

మోటరోలా: ఒకప్పుడు ఇండియాలో మోటరోలా మొబైల్ హ్యాండ్‌‌సెట్ కంపెనీల్లో ప్రముఖమైనదిగా చెప్పొచ్చు. ఈ కంపెనీని గూగుల్ ఐఎన్‌‌సీకి 2.91 బిలియన్‌‌లు చెల్లించి చైనాకు చెందిన లెనోవో గ్రూప్ దక్కించుంది.

పబ్‌‌జీ మొబైల్: పబ్‌‌జీకి చైనాకు లింకేంటి అనే విషయంలో సూటిగా జవాబు చెప్పలేం. మల్టీప్లేయర్ వీడియో గేమ్ అయిన పబ్‌‌జీని సౌత్ కొరియాకు చెందిన బ్లూహోల్ సబ్సిడరీ పబ్‌‌జీ కార్పొరేషన్ రూపొందించింది. అయితే పబ్‌‌జీ మొబైల్‌‌లో చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ 1.5 శాతం స్టాక్‌‌ను కొనుగోలు చేసింది. 118 యాప్స్‌‌ను బ్యాన్ చేసిన ఇండియా అనంతరం పబ్‌‌జీని కూడా బ్యాన్ కేంద్రం చేసింది. దీంతో టెన్సెంగ్ గేమ్స్‌‌ను పబ్‌‌జీ మొబైల్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి తొలగిస్తున్నట్లు బ్లూహోల్ రీసెంట్‌‌గా తెలిపింది.

ఎంజీ మోటార్స్: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌‌లో తక్కువ కాలంలోనే ఎంజీ మోటార్స్ మంచి చోటు దక్కించుకుంది. అయితే యూకేకు చెందిన ఎంజీ మోటార్స్‌‌ యాజమాన్య బాధ్యతలు చైనాకు చెందిన ఎస్‌‌ఏఐసీ మోటార్ చూసుకుంటుందన్న విషయం  చాలా మందికి తెలియకపోవడం గమనార్హం.

జీఈ ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్: రిఫ్రిజిరేటర్లు, ఫ్రిడ్జ్‌‌లు, క్లోత్ వాషర్స్, డ్రయ్యర్స్‌‌ను రూపొందించడంలో వందేళ్ల అనుభవం ఉన్న ప్రముఖ కంపెనీ జీఈ ఎలక్ట్రిక్‌‌లోనూ చైనా కంపెనీలకు వాటా ఉంది. డ్రాగన్‌కు చెందిన హయర్ జనరల్ ఎలక్ట్రిక్‌‌లో ఓనర్‌‌షిప్ డీల్ దక్కించుకుంది.

గేమింగ్: మీరొక వేళ గేమర్స్ అయితే మీకు రియోట్ గేమ్స్ గురించి తెలిసే ఉంటుంది. లీగ్ ఆఫ్ లెజెండ్స్ గురించి గేమ్స్ ఆడని వారికి కూడా తెలుస్తుంది. రియోట్‌‌ను చైనాకు చెందిన టెన్సెంట్‌‌ కొనుగోలు చేసింది. 2011లో రియోట్‌‌ గేమ్స్‌‌లో మెజారిటీ స్టేక్‌‌ను దక్కించుకుంది.

Latest Updates