బాడీ స్ర్పే వాడుతున్నారా..ఈ జాగ్రత్తలు పాటించండి

do-you-use-body-spray-follow-these-cautions

ఈరోజుల్లో బాడీ స్ప్రే కొట్టుకోకుండా ఇంట్లోంచి అడుగు పెట్టడం లేదు చాలామంది. ఆ అలవాటు కూడా ఒక రకంగా మంచిదే. ఎండలో, దుమ్ములో తిరగడం వల్ల వచ్చే శరీర దుర్వాసనను కొంతవరకు తగ్గిస్తుంది. అయితే.. బాడీ స్ప్రే వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో దొరికే వాటిలో ఏది పడితే అది వాడకూడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్నిరకాల బాడీస్ప్రేలు వాడాలి. ఆఫీసుకు వెళ్లేటప్పుడు పూలు, నిమ్మ ఫ్లేవర్లు బాగుంటాయి. పక్కవారికి ఇబ్బంది కలిగించకుండా ఆహ్లాదంగా ఉంటాయి. ఎండలో బయటకు వెళ్లాల్సినప్పుడు వీలైనంత వరకు గాఢత తక్కువగా ఉన్న స్ప్రే వాడాలి. లేకపోతే చర్మం మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు మీటింగులకు వెళ్లేటప్పుడు బాడీ స్ప్రే కొట్టకపోవడమే బెటర్​. ఎందుకంటే.. మీటింగ్​ వాతావరణాన్ని బాడీ స్ప్రే దెబ్బతీసే అవకాశం ఉంది. కొంతమంది రోజంతా సువాసనలు రావాలని ఎక్కువ స్ప్రే శరీరం మీద చల్లు కుంటారు. అది మంచిది కాదు. ఇంకో విషయం.. స్ప్రే కొనేటప్పుడు దాని తయారీ తేదీ, ఎక్స్​పైరీ డేట్​ కూడా గమనించండి. లేదంటే.. చర్మసమస్యలు రావచ్చు. నగల మీద, శరీరం మీద అతి దగ్గర్నుంచి నేరుగా స్ప్రే కొట్టకూడదు. ఈ విషయం మర్చిపోకండి. ఇకపై స్ప్రే వాడినప్పుడు ఇవి పాటించండి.

Latest Updates