ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్న డాక్టర్, నర్స్

బ్రిటన్ లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది.ఈ క్రమంలోనే ఓ డాక్టర్, నర్సు జంట ఆస్పత్రిలో ఉన్న ప్రార్థనామందిరంలోనే పెళ్లి చేసుకుంది. జేన్ టిప్పింగ్ అనే నర్స్,  డాక్టర్ అన్నలన్ నవరత్నం లండన్ లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

జేన్ ఉత్తర ఐర్లాండ్ కు చెందిన అమ్మాయి కాగా, నవరత్నం శ్రీలంక జాతీయుడు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఆగస్టులో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే కరోనా సంక్షోభం వీరిని మరింత ముందే పెళ్లి చేసుకునేలా చేసింది. ఉత్తర ఐర్లాండ్, శ్రీలంక నుంచి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వచ్చేందుకు వీలుకాకపోవడంతో ఈ జోడీ ఏప్రిల్ లో తమ ఆస్పత్రిలో ఉన్న చర్చిలో పెళ్లితో ఒక్కటైంది. ఈ పెళ్లిని రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారా చూశారు.

ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సెయింట్ థామస్ ఆస్పత్రి వర్గాలు రెండ్రోజుల క్రితమే సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం అందరికీ తెలిసింది.

Latest Updates