మేడ్చల్ లో దారుణం.. రివాల్వర్ తో కాల్చుకొని డాక్టర్ ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా-సాకేత్ రోడ్ మిథులలో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న ఆదిత్య ఆసుపత్రి ఎండీ రవీంద్ర కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన లైసెన్స్డ్ రివాల్వర్ తో  డాక్టర్ రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన రవీంద్ర కుమార్ ఆదివారం తన భార్యతో ఓ ఫంక్షన్ విషయంలో గొడవపడ్డట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ కారణంగానే ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి రవీంద్ర తన రివాల్వర్ కాల్చుకుని చనిపోయినట్లు సమాచారం.  డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం తో పోలీసులు పరిశోధిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Doctor commits suicide by shooting with his licensed revolver in Medchal district

Latest Updates