12 ఏండ్ల పని పిల్లాడిపై వేడి నీళ్లు పోసి.. చిత్రహింసలు పెట్టిన డాక్టర్ దంపతులు

అస్సాంలో దారుణం..

డాక్టర్ తోపాటు భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు 

న్యూఢిల్లీ: ఇంట్లో పని చేసే ఓ 12 ఏండ్ల పిల్లాడిపై వేడి నీళ్లు పోసిన ఓ డాక్టర్‌‌‌‌ను, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంలోని దిబ్రూఘర్‌‌‌‌లో ఈమధ్య జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. దిబ్రూఘర్‌‌‌‌లోని అస్సాం మెడికల్‌‌‌‌ కాలేజ్‌‌‌‌ అండ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో సిద్ధిప్రసాద్‌‌‌‌ దేయురీ డాక్టర్‌‌‌‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య మిటాలి కొన్వర్‌‌‌‌ మొరన్‌‌‌‌ కాలేజ్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌. వీళ్ల ఇంట్లో 12 ఏండ్ల పిల్లాడు పని చేస్తున్నాడు. ఆ పిల్లాడు నిద్రపోతున్న టైమ్‌‌‌‌లో సిద్ధి వేడి నీళ్లు పోసి చిత్రహింసలు పెట్టాడు. ఈ సంఘటననంతా ఎవరో వీడియో తీసి అధికారులకు పంపిస్తే బాలల సంరక్షణ కమిటీ విభాగం వాళ్లు వచ్చి పిల్లాడిని రెస్క్యూ చేశారు. పిల్లాడు ప్రస్తుతం చైల్డ్‌‌‌‌ కేర్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో ఉన్నాడు. పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లిన టైమ్‌‌‌‌లో సిద్ధి సెలైన్‌‌‌‌ ఎక్కించుకుంటూ కనిపించాడు. దీంతో పోలీసులు వీలైనంత తొందరగా దగ్గర్లోని పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో రిపోర్టు చేయాలని చెప్పి వెళ్లిపోయారు. అదే అదనుగా ఇద్దరూ పారిపోయారు. పోలీసులు సెర్చ్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ స్టార్ట్ చేసి వాళ్లను నాగౌన్‌‌‌‌లో అరెస్టు చేశారు.

Latest Updates