ట్రీట్ మెంట్ కోసం వచ్చిన మహిళను డాక్టర్ వేధించాడు

హైదరాబాద్ : ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే కీచకపర్వానికి ఒడిగట్టాడు. ట్రీట్ మెంట్ కోసం వచ్చిన మహిళా పేషెంట్ ను లైంగికంగా వేధించిన డాక్టర్ ను అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ పోలీసులు. ఈ సంఘటన మంగళవారం చిలుకలగూడలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..సికింద్రాబాద్ మైలర్ గడ్డలో 30సంవత్సరాలుగా క్లినిక్ నడుపుతున్నా డా.చంద్రమోహన్. రెగ్యులర్ గా చికిత్స కోసం ఓ మహిళా..ఆమె భర్త చంద్రమోహన్ హస్పిటల్ కి వస్తుండేవారు. మంగళవారం ఆమె భర్త వేరే పని మీద బయటకు వెల్లడంతో.. ఒంటరిగా వైద్యం కోసం ఆ మహిళ చంద్రమోహన్ హస్పిటల్ కు వెళ్లింది.

వచ్చిన మహిళను చెకప్ పేరుతో డాక్టరు లోపలి గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిని పసి గట్టిన మహిళ  వెంటనే డాక్టర్ ను తోసేసి హస్పిటల్ నుంచి బయటపడింది. ఇంటికి వచ్చి జరిగిన విషయం భర్తకు తెలుపడంతో  చిలుకల గుడా పోలీసులకు పిర్యాదు చేశారు భార్యాభర్తలు. నిందితున్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు పోలీసులు. 65సంవత్సరాల ముసలి డాక్టరు ..22సంవత్సరాల వివాహిత పట్ల వ్యవహరించిన తీరు సిగ్గు చేటు అన్నారు.  డాక్టరును బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు.

Latest Updates