సుశాంత్ ది ముమ్మాటికి హత్యే : వీడియోని ట్వీట్ చేసిన డాక్ట‌ర్

బాలీవుడ్ హీరో సుశాంత్ మ‌ర‌ణం ఆత్మ‌హ‌త్య‌కాదు హ‌త్యేన‌న్న అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఇప్ప‌టికే సుశాంత్ మ‌ర‌ణంపై బీజేపీ మాజీ కేంద్ర‌మంత్రి సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. సుశాంత్ మ‌ర‌ణం ఆత్మ‌హ‌త్య కాద‌ని, హ‌త్య చేశార‌ని అన్నారు.
తాజాగా ప్ర‌ముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా సుశాంత్ డెడ్ బాడీకి సంబంధించి ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఆ వీడియోలో సుశాంత్ డెడ్ బాడీ ఫోటోల్ని చూపిస్తూ త‌న వాద‌న‌ల్ని వినిపించారు.
ఆత్మ‌హ‌త్య చేసుకుంటే బాడీ ఎలా ఉంటుంది. హ‌త్య చేసిన బాడీ ఎలా ఉంటుందో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా సుశాంత్ డెడ్ బాడీకి సంబంధించి ప‌లు అనుమానాల్ని వ్య‌క్తం చేశారు. బెడ్ పై ఉన్న సుశాంత్ డెడ్ బాడీ మొహంపై ప‌లు గాయాలున్న‌ట్లు మార్క్ చేసి చూపించారు. అదే విధంగా కంటి కింద క‌మిలిపోవ‌డం, క‌న్ను స‌గం మాత్ర‌మే మూసుకుపోయింద‌ని, ఉరి వేసుకున్న వారి శ‌రీరం ఈ విధంగా ఉండ‌దు అంటూ డాక్ట‌ర్ మీనాక్షి తెలిపారు
అందుకు సంబంధించిన వీడియో ను ట్వీట్ చేశారు. మీనాక్షి ట్వీట్ ను సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి రీట్వీట్ చేస్తూ సుశాంత్ ది ఆత్మ‌హ‌త్య కాద‌ని, హ‌త్యేన‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

Latest Updates