మహిళా పేషెంట్ తో డాక్టర్ అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

వైద్యం కోసం వచ్చిన మహిళా పేషెంట్ తో అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్ పై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ ఉప్పల్ చిలుక నగర్ బస్తీ లో ఉన్న హాస్నిటల్ కి ఓ మహిళ తలనొప్పి ఉందని వెళ్లింది. అయితే అక్కడి డాక్టర్ మహిళకు వైద్యం చేస్తానని తలకు మసాజ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పాటు మళ్లీ రెండు రోజులకి రమ్మని ఆమెకు చెప్పాడు. డాక్టర్ అసభ్య ప్రవర్తన గమనించిన సదరు మహిళ  ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates