డాక్టర్ మందులకు బదులు ఏం రాశాడో తెలిస్తే షాక్

doctor-precribed-condom-to-the-patient

ఝార్ఖండ్‌: ట్రీట్ మెంట్ కోసం వచ్చిన మహిళపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు డాక్టర్. ఆమెకు మెడికల్ స్లిప్ లో మందులకు బదులుగా కండోమ్ అని రాసి ఇచ్చాడు. ఈ సంఘటన ఝార్ఖండ్ లో జరిగింది.

ఈ నెల 23న కడుపునొప్పి బాధతో ఓ మహిళ ఝార్ఖండ్‌ లోని ఘాటిశ్లాలో ఉన్న సర్కారు హస్పిటల్ కి వెళ్లింది. ఆమెకు ఓ ప్రిస్క్రిప్షన్‌ రాసిచ్చాడు. ఆ చిట్టీని పట్టుకుని మెడికల్ షాపుకు వెళ్తే… అక్కడి సిబ్బంది కంగుతిన్నారు. ఇదేంటి… కండోమ్‌ రాశారని వారు చెప్పడంతో ఆ మహిళ షాక్ అయ్యింది. స్థానికుల సాయంతో ఆమె ఈ విషయాన్ని సీనియర్ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లి… ఆ డాక్టర్ పై సీనియర్ కు కంప్లైంట్ చేసింది.

డాక్టర్ ను విచారించేందుకు ఓ మానసిక వైద్యుడు సహా త్రిసభ్య కమిటీని ఉన్నతాధికారులు నియమించారు. అయితే దీని వెనుక పెద్ద కుట్రే ఉందంటున్నారు డాక్టర్‌ అష్రఫ్‌. ఇందులో ఇతర సిబ్బంది పాత్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. హస్పిటల్ లో న్యాయం జరగకపోతే తాను పోలీసులను ఆశ్రయిస్తానని తెలిపింది మహిళ.

Latest Updates