9 నెలల పాపకి బ్లడ్ టెస్ట్.. డాక్టర్ పాట వీడియో వైరల్

  • చిన్నారి గ్రేసీకి పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లమ్
  • పాట పాడుతూ బ్లడ్ తీసిన డాక్టర్..
  • ఏడవకుండా ఆలకించిన పసికందు

పసి పిల్లలకు ఇంజెక్షన్ చేయించాలంటే తల్లిదండ్రులకు తలప్రాణం తొకకొస్తుంది. అంతదాకా ఎందుకు సూది పొడిపించుకోవాలంటే భయపడే పెద్దవాళ్లు మనలో ఎంత మంది ఉండారో! కానీ బ్లడ్ టెస్టుకు రక్తం తీస్తున్నా 9 నెలల పసికందు కంటతడి పెట్టకుండా నవ్వుతూ చూస్తోంది! ఆ పాప ఎప్పుడూ అంతేనా? అంటే కాదని తల్లి చెబుతోంది. మరి ఇప్పుడే ఎందుకిలా అంటే అది డాక్టర్ గొప్పతనమే.. ఏ మంత్రం వేశాడో కానీ, ఆ పాపను తన పాటలో లీనమై పోయేలా చేశాడు. తన ఆలాపనను ఆలకిస్తూ ఆ చిన్నారి.. ఎడవడం మర్చిపోయినట్టుంది!

ఈ ఘటన స్కాట్లాండ్‌లోని ఇన్వెర్నెస్‌లో జరిగింది. షానాంన్ వెమిస్, మిక్కీ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. వారిద్దరి ప్రేమకు ప్రతిరూపం చిన్నారి గ్రేసీ. ఈ పసికందుకు ఫిబ్రవరి 7న పుట్టింది. కానీ దురదృష్టవశాత్తు పుట్టుకతోనే పాపకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. దీంతో కొన్నాళ్ల క్రితం ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించారు. ఇక తర్వాత నెల నెలా రొటీన్ చెకప్ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఓ డాక్టర్‌ ఆ పాపకు  బ్లడ్ టెస్ట్ చేసేందుకు రక్తం తీశారు. అప్పుడు ఆ పాప ఏడవకుండా తనలోని గాయకుడిని బయటకు తీశారు.

This is something so special! My daughter is usually distraught getting bloods done, she has had them done a huge amount of times but never has had a reaction quite like this, not one tear. I have never met a doctor quite like this one, absolutely amazing. He had a smile on everyone’s face. An example of a job being more than a pay check at the end of the month. He has made our day 💗

Posted by Shannon Wemyss on Friday, November 1, 2019

పాటను ఆలకిస్తూ కంటతడి పెట్టలేదా చిన్నారి. దీన్ని వీడియో తీసిన ఆ పసికందు తల్లి షానాంన్ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. నవంబరు 1న షేర్ చేసిన ఆ వీడియోను సోమవారానికి దాదాపు 5 లక్షల మందికిపైగా చూశారు. ఆ డాక్టర్‌ను సూపర్, అమేజింగ్ అంటూ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. పసిపాపను ఏడిపించకుండా బ్లడ్ టెస్ట్ చేయడం గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest Updates