హిమోఫీలియా పేషెంట్​కు అరుదైన సర్జరీ

హిమోఫీలియా పేషెంట్​కు అరుదైన సర్జరీ

మాదాపూర్,వెలుగు: హిమోఫీలియా( రక్తస్రావ లక్షణం)తో బాధపడుతూ క్రిటికల్ కండీషన్ లో ఉన్న పేషెంట్​కు  మాదాపూర్ మెడికవర్​ డాక్టర్లు సర్జరీ చేసి ప్రాణాలను కాపాడారు. కూకట్​పల్లికి చెందిన ఓ వృద్ధుడు(79) హిమోఫీలియాతో బాధపడుతూ..  ప్రాణాపాయ స్థితిలో మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్​లో జాయిన్ అయ్యాడు. డాక్టర్లు పేషెంట్ హెల్త్ కండీషన్ పూర్తిగా స్టడీ చేసిన తర్వాత సర్జరీ ద్వారా టీఏవీఆర్( ట్రాన్స్ క్యాథెటర్ అరోటిక్ వాల్వ్ రీ ప్లేస్ మెంట్) చేయాలని నిర్ణయించారు. టీఏవీఆర్ ద్వారా హిమోఫీలియా పేషెంట్ ను ప్రాణాలను కాపాడటం దేశంలోనే ఇదే మొదటిసారని మెడికవర్ డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం పేషెంట్  పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడన్నారు.