హాట్ సమ్మర్‌లో కూల్ డ్రింకులు వద్దు… రాగి జావ తాగాలంటున్న డాక్లర్లు

సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. ఉక్కపోతలు, ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సీజన్ లో చల్లని ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తీసుకునేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే కూల్ గా ఉండే ఐటెమ్స్ తీసుకోవడంతో శ్వాస కోశ సంబంధ వ్యాధులొస్తాయంటున్నారు డాక్టర్స్. సమ్మర్ లో చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఎండాకాలం వచ్చింది. మధ్యాహ్నామైతే చాలు వేడి పెరిగిపోతోంది. సమ్మర్ హాట్ ని తట్టుకునేందుకు చాలామంది ఇన్ స్టంట్ గా రిలీఫ్ ఇచ్చే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, కూల్ ఐటమ్స్ తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు.

సమ్మర్ సీజన్ లో పిల్లలు, యూత్ కూల్ డ్రింక్స్, చల్లని డైరీ ప్రాడక్ట్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఒకవేళ చల్లని పదార్థాలు తినాలంటే.. వీలైనంత వరకు మధ్యాహ్నం మాత్రమే తినాలని సూచిస్తున్నారు.  జలుబు, దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పటికప్పుడు గోరు వెచ్చని నీళ్లను తాగాలంటున్నారు. రాత్రిపూట వేడిగా ఉండే పదార్థాలు, సూప్స్ తీసుకుంటే మంచిదంటున్నారు పల్మనాలజిస్టులు. 27 డిగ్రీలకి పైగా టెంపరేచర్ ఉంటే ఏ వైరస్ లు వచ్చే అవకాశం ఉండదంటున్నారు.

సమ్మర్ హీట్ ను తట్టుకోవాలంటే.. ఫ్రెష్ ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ.. సీ విటమిన్ ఉండే ఫుడ్స్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు డైటీషియన్స్. జలుబు, దగ్గు, పల్మనరీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు.  హెల్దీగా ఉన్నవాళ్లు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ జ్యూసులతో పాటు డైట్ ను ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. కూల్ ఐటమ్స్, ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉంటూ వ్యక్తిగత శుభ్రతను పాటిస్తే వైరస్ ల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.

హైద్రాబాద్ లో కరోనా భయంతో.. చాలా మంది జాగ్రత్తలు పాటిస్తున్నారు. వీటితో పాటే.. చల్లని పదార్థాలకు దూరంగా ఉంటే.. మంచిదంటున్నారు డాక్టర్లు. కూల్ ఫుడ్స్ బదులు.. జావ, ఫ్రూట్ జ్యూసులు డైట్ లో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Latest Updates