ఏపీలో హై అలర్ట్.. ఆ వృద్ధుడు ఎవరెవర్ని కలిశాడో ఆరా?

ఏపీలో కరోనా విస్తరిస్తుండటంతో  వైద్యశాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు. విశాఖలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ రావడంతో అతడు నివాసమున్న ప్రాంతాల్లో డాక్టర్లు ఆరాతీస్తున్నారు. ఇటీవల మక్కా వెళ్లి వచ్చిన  ఈ వృద్ధుడు ఈ వారం రోజులపాటు ఎవరెవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లాడు తదితర అంశాలపై ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వృద్దుడి నివాస ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు.  ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఆశావర్కర్లు, వాలంటీర్లతో కలిపి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.  మొత్తం 7,800 ఇళ్లపై ఆరాతీస్తున్నామన్నారు. స్పేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.

 

Latest Updates