
దేశవ్యాప్తంగా ఇవాళ( శనివారం,జనవరి 16) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ.. చాలామందిని ఒక డైలామా వెంటాడుతోంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్లలో ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలన్న ఆప్షన్ లేకపోవడంతో వ్యాక్సినేషన్ పై చాలామందిలో అనుమానాలు వస్తున్నాయి. సామాన్యులే కాదు ఆఖరికి డాక్టర్లు కూడా వ్యాక్సిన్ విషయంలో తమకు ఆప్షన్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన డాక్టర్లు తమకు కోవాగ్జిన్ వద్దని.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాలంటున్నారు. దీనికి సంబంధించి రెసిడెంట్ డాక్టర్లు హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వద్దని… సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్‌నే ఇవ్వాలని లేఖలో స్పష్టం చేశారు.
అంతేకాదు.. కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయకుంటే తాము భారీ సంఖ్యలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోమని తేల్చిచెప్పారు డాక్టర్లు.