నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్

నెట్టింట్లో సన్న పిన్ను చార్జర్ వైరల్ అవ్వడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా..? అస్సాం లో ఓ యువకుడికి ఆపరేషన్ చేసి సన్న పిన్ను చార్జర్ ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అస్సాంలోని గౌహతిలో ఆపరేషన్ చేసి 30 ఏళ్ల వ్యక్తి మూత్రాశయం నుంచి మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌ను తొలగించారు.గౌహతికి చెందిన ఓ ఆస్పత్రిలో కన్సల్టెంట్ డాక్టర్ వాలియుల్ ఇస్లాం ఇటీవల 30 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ చేసి తన మూత్రాశయం నుండి మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌ను తొలగించారు.

ఈ సందర్భంగా  డాక్టర్ వాలియుల్ ఇస్లాం మాట్లాడుతూ ఓ వ్యక్తి  కొద్దిరోజుల క్రితం పొర పాటున ఛార్జర్ మింగానని, కడుపునొప్పి వస్తుందంటూ తన వద్దకు వచ్చాడన్నారు. దీంతో తాను ఎండోస్కోపీ టెస్ట్ చేయించినా కేబుల్ కనిపించలేదని తెలిపారు. అయితే ఫైనల్ గా తాను ఎక్సరే తీసేందుకు ప్రయత్నించినట్లు, ఎక్సరే చూసి.. మూత్రాశయంలో ఉన్న మొబైల్ ఛార్జింగ్ కేబుల్ చూసి షాక్ అయినట్ల చెప్పారు. తన కెరియర్ లో ఇలాంటి కేసులు ఇంతవరకు చూడలేదన్న వాలియుల్.. బాధితుడు తన పురుషాంగం ద్వారా కేబుల్ ను  చొప్పించినట్లు నిర్ధారించారు. సదరు యువకుడు లైంగిక ఆనందం కోసం తన పురుషాంగం ద్వారా వస్తువులను చొప్పించే అలవాటు ఉందని, వైద్య పరిభాషలో దాన్ని  యురేత్రల్ హస్త ప్రయోగం అంటారని ఇండియా టుడే తెలిపారు. తన 25ఏళ్ల అనుభవంలో ఈ కేసును సవాల్ గా తీసుకొని  ఆపరేషన్  చేసినట్లు తెలిపారు డాక్టర్ వాలియల్. ఆపరేషన్ విజయవంతమైందని బాధితుడు కోలుకుంటున్నాడని డాక్టర్ వాలియుల్ ఇస్లాం అన్నారు.

Latest Updates