చావుకు షేక్ హ్యాండ్..15బీర్లతో ప్రాణం పోసిన డాక్టర్

ఓ తాగుబోతు పీకలదాకా మద్యం తాగి చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ముళ్లును ముళ్లుతోనే తియ్యాలన్న చందంగా తాగుబోతును డాక్టర్ ప్రాణాలతో బయట పడేశాడు.  వియత్నాంలోని క్వాంగ్ త్రి ప్రాంతానికి చెందిన గువెన్ వ్యాన్ నహాట్ (48)  మోతాదు కంటే 1,119రెట్ల మద్యం తాగి ఆస్పత్రి పాలయ్యాడు.

వైద్య పరీక్షలు చేసిన వైద్యులు నహాట్ మిథనాల్ స్థాయి ఎక్కువ కావడంతో కాలేయం దెబ్బతిన్నట్లు గుర్తించారు.అందరూ చనిపోతాడనే అనుకున్నారు.  కానీ ఓ డాక్టర్ నహాట్ కు గంట గంటకు మొత్తం 15బాటిళ్ల బీర్ ను పంపింగ్ చేశాడు. సాధారణంగా బీర్లు, స్పిరిట్ లలో ఇథనాల్, మిథనాల్  అనే రెండు రకాలైన ఆల్కహాల్ కంటెంట్లు ఉంటాయి.

దీనిలో మిథనాల్ ఆల్కాహాల్ చాలా డేంజర్ ఎక్కువ తాగితే ప్రమాదానికి గురవుతారు. అయితే బాధితుడు నహాట్ తాగిన ఆల్కాహాల్ లో మిథనాల్  శాతం ఎక్కువగా ఉండడంతో దానికి విరుగుడుగా డాక్టర్  ఇథనాల్ కంటెంట్ ఉన్న 15బీర్లను బాడీలోకి ఎక్కించాడు.

మిథనాల్  ఫార్మిక్ యాసిడ్‌‌‌గా మారేలోపే ఇథనాల్ ఆల్కహాల్ ను ఎక్కించడంతో ప్రాణాలతో భయట పడ్డాడు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడు.

Latest Updates