ప్రి-ఎక్లంప్సియా టెస్ట్ : గర్భిణిలకు అవసరం అంటున్న డాక్టర్స్

 మారిన లైఫ్ స్టైల్ కి తోడు రోజు రోజుకు పెరుగుతున్న జబ్బులతో ప్రసవాలు కష్టంగా మారాయి. దేశంలో ప్రతి లక్ష డెలివరీల్లో 170 మంది తల్లులు చనిపోతున్నారు. ఈ సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటోంది. ఈ తరహా మరణాలను అరికట్టేందుకు గర్భిణీలకు ప్రి-ఎక్లంప్సియా టెస్టు అందుబాటులోకి తెచ్చింది డయాబేటోమిక్స్ సంస్థ. ఈ-లూమెల్లా టెస్టును లాంచ్ చేసింది. దీంతో ప్రి-ఎక్లంప్సియా జబ్బున పడుతున్నవారిని గుర్తించే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.

మామూలు బీపీగా పిలిచే ప్రి-ఎక్లంప్సియా డిసీజ్, తల్లితో పాటు డెలివరీ తర్వాత శిశువుపైనా ప్రభావం చూపుతుందంటున్నారు డాక్టర్లు. ఈ తరహా టెస్టులతో… ప్రి-ఎక్లంప్సియాను గర్బం దాల్చిన 20వ వారంలో గుర్తించవచ్చని, ఒక్కసారి జబ్బుపడితే తల్లి ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. లూమెల్లా కిట్ లో రెండు రక్తం చుక్కలు వేస్తే.. పది నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుందన్నారు. ఈ టెస్టు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రావడంతో వెయ్యి రూపాయల వరకూ ఖర్చవుతుందని చెబుతున్నారు.

డెలివరీ టైంలో సాధారణ కాంప్లికేషన్స్ గుర్తించేందుకు ఆల్ట్రా సౌండ్ పై ఇప్పటివరకు ఆధారపడుతుండగా.. ఈ తరహా లేటెస్టు కిట్స్ రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల మహిళలకు కూడా ఎంతగానో ఉపయోగపడనుంది.

Latest Updates