కేవైసీ పేరుతో ట్రాప్ చేసిన్రు

లాక్డౌన్ టైమ్లో అప్డేట్ చేయాలంటూ ఫేక్ కాల్స్
రూ.4 లక్షలు కొట్టేసిన సైబర్ గ్యాంగ్
నలుగురు బాధితుల్లో ఇద్దరు డాక్టర్లు

లాక్ డౌన్ నేపథ్యం లో బ్యాంక్అకౌంట్ కేవైసీ అప్డేట్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు నలుగురి నుంచి రూ.4లక్షలు కొట్టేశారు. బాధితుల్లో ఇద్దరు డాక్టర్లున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ తో ఆర్బీఐ ప్రకటించిన లోన్లు, ఈఎంఐల వాయిదాను కూడా టార్ట్గె గా చేసుకుని సైబర్ క్రిమినల్స్ మోసం చేసే చాన్సెస్ ఉన్నాయని, అలర్ట్ గా  ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అమౌంట్ రీఫండ్ చేస్తామని..
హైదర్ గూడకి చెందిన డాక్టర్ కి గత నెల 23న ఓ కాల్ వచ్చింది. ఓ ప్రముఖ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పిన వ్యక్తిలాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ లో ప్రాబ్లమ్ రాకుండా కేవైసీ అప్ డేట్ చేసుకోవాలన్నాడు. పేషెంట్స్ తో బిజీగా ఉన్న డాకర్ అతడిమాటలు నమ్మి, ఓటీపీ నంబర్ కూడా చెప్పేశాడు. అలా రూ.50 వేలు కొట్టేసిన సైబర్ నేరగాడు మళ్లీ కాల్ చేసి ట్రాన్స్ ఫర్ అయిన డబ్బు రీఫండ్ చేస్తామని నమ్మించాడు. అలా మొబైల్ కి వచ్చే ఓటీపీ నంబర్స్ ను తెలుసుకుని 5రోజుల్లో రూ.2 లక్షలు కొట్టేశాడు. ఆలస్యంగా గుర్తించిన డాకర్ శనివారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

అమీర్ పేటలో..
అమీర్ పేటకి చెందిన మరో డాక్టర్ ను  ఈ నెల 4న సైబర్ నేరగాళ్లు టార్గెట్  చేశారు. డెబిట్ కార్డ్ బ్లాక్ అయ్యిందని నమ్మించి ఓటీపీ నంబర్స్ తెలుసుకున్నారు. రెండు ట్రాన్సా క్షన్స్ లో రూ.75 వేలు కొట్టేశారు. బాధితుడు శనివారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. మరో రెండు కేసుల్లోనూ సైబర్ నేరగాళ్లు ఇద్దరి నుంచి ఎనీ డెస్క్ యాప్ ద్వారా రూ.లక్షా 31 వేలు కొట్టేశారు.

Latest Updates