అరుదైన సర్జరీతో మహిళకు ప్రాణం పోసిన డాక్టర్లు

హైదరాబాద్ : మహిళ గర్భం నుంచి 6.5కేజీల కణితిని  బయటికి తీశారు డాక్టర్లు. ఈ అరుదైన సర్జరీ మంగళవారం హైద్రాబాద్ కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ హస్పిటల్ లో జరిగింది. పెళ్లై చాలా రోజులైనా పిల్లలులేరని పర్వీన్ అనే మహిళ హస్పిటల్ కి వెళ్లింది. ఆమెకు పరీక్షలు చేసిన డాక్టర్లు షాక్ అయ్యారు. గర్భాశయంలో పెద్ద కణితిని గుర్తించారు.

ఆపరేషన్ కు మహిళ ఫ్యామిలీ ఓకే చెప్పడంతో.. రెండు గంటల పాటు సర్జరీ చేసి 6.5 కేజీలు,  28 సెంటీమీటర్ల కణితిని గర్భసంచి నుంచి తొలగించారు. కొన్ని రోజులైతే మహిళ ప్రాణాలకే ముప్పు కలిగేదని చెప్పారు డాక్టర్లు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని..ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా ఉందని తెలిపారు.

Latest Updates