రెండు గర్భ సంచులు.. అరుదైన సర్జరీ

హైదరాబాద్ : ఓ మహిళకు రెండు గర్భ సంచులు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు.. సర్జరీ చేసీ ఒక గర్భ సంచిని తొలగించినట్లు తెలిపారు. గర్భం సరిగా నిలబడకపోవడంతో సిద్దిపేట కు చెందిన ఓ మహిళ వెస్ట్ మారెడ్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి ట్రీట్ మెంట్ కోసం వచ్చింది. ఆ మహిళకు 2 గర్భ సంచులున్నట్లు గుర్తించామన్న డాక్టర్లు.. ఈ క్రమంలోనే గర్భం నిలబడటంలేదని తెలిపారు. వెంటనే ఒక గర్భ సంచి తొలగించుటకు మహిళ కుటుంబ సభ్యులు అంగీకరించడంతో.. సోమవారం సర్జరీ చేసి ఒక గర్భ సంచిని తొలగించామన్నారు. ఒకే గర్భ సంచి ఉండే విధంగా కంప్యూటరైజ్ సర్జరీ చేశామని తెలిపారు డాక్టర్లు.

 

Latest Updates