నేటి నుంచి షేర్లు లిస్టింగ్ : IRCTC ఎంట్రీ అదరగొట్టేనా?

న్యూఢిల్లీ:  ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌‌(ఐఆర్‌‌‌‌సీటీసీ) షేర్లు సోమవారం (ఈరోజు) స్టాక్ మార్కెట్‌‌లో లిస్టవుతున్నాయి. ఇటీవలే రూ.645 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌‌‌‌కు ఐఆర్‌‌‌‌సీటీసీ వచ్చింది. బీఎస్‌‌ఈ, ఎన్‌‌ఎస్‌‌ఈలలో  షేర్లు లిస్ట్‌‌ కానున్నాయి.  గ్రే మార్కెట్లో రూ. 100 ప్రీమియంతో ఐఆర్‌‌సీటీసీ షేర్ల ట్రేడింగ్‌‌ మొదలై ఒక దశలో రూ. 220 దాకా జంప్‌‌ చేసి, ప్రస్తుతం రూ. 160 ప్రీమియంతో ట్రేడవుతున్నట్లు మార్కెట్‌‌ వర్గాలు తెలిపాయి. దీంతో లిస్టింగ్‌‌లోనే షేరు అదరగొడుతుందని అంచనా వేస్తున్నారు.

సోమవారం(2019 అక్టోబర్) నుంచి ఐఆర్‌‌‌‌సీటీసీ లిమిటెడ్‌‌ ఈక్విటీషేర్లు లిస్ట్ అవుతాయి. బీ గ్రూప్ సెక్యురిటీస్‌‌ కేటగిరీలో ఐఆర్‌‌సీటీసీ షేర్లను చేర్చినట్లు బీఎస్‌‌ఈ తన సర్క్యూలర్‌‌‌‌లో వెల్లడించింది. ఈ నెల 4 న ముగిసిన ఐఆర్‌‌సీటీసీ ఐపీఓ 112 టైమ్స్  ఓవర్‌‌ సబ్‌‌స్క్రయిబ్‌‌ అయింది. ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.315 నుంచి రూ.320 మధ్యలో ఉంది. ఐఆర్‌‌సీటీసీ షేర్‌‌ ఫేస్ వాల్యు రూ.10. ఇష్యూలో భాగంగా 2.1 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌‌కి ఉంచారు. మొత్తం ఇష్యూ సైజులో లక్షా 60 వేల ఈక్విటీ షేర్లు అర్హులైన ఎంప్లాయీస్‌‌కు రిజర్వ్ చేశారు. యెస్ సెక్యురిటీస్ , ఎస్‌‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యురిటీస్‌‌ ఈ ఇష్యూకి మర్చెంట్ బ్యాంకర్లుగా వ్యవహరించాయి.

Latest Updates