డ్రైనేజీ నీళ్లతో కరోనా వ్యాపిస్తుందా?

హైదరాబాద్, వెలుగు: మురుగునీటితో కరోనా వ్యాపిస్తుందా లేదా అనే అంశంపై హైదరాబాద్ లోని సెంటర్ఫర్సెల్యూలార్అండ్ మాలిక్యుర్ బయాలజీ (సీసీఎంబీ) స్టడీ చేస్తోంది. ఇప్పకే హైదరాబాద్లోని పలు సీవరేజీ వాటర్ ట్రీట్ మెంట్ప్లాంట్ (ఎస్టీపీ)ల నుంచి శాంపిళ్లనుసేకరించింది. కరోనా ఎంత కాలంబతికి ఉంటుంది..ఎలామార్పు చెందుతుందన్న విషయాలను తేల్చనుంది. స్టడీ కోసం హుస్సేన్ సాగర్, అంబర్పేట్, నాగోల్, అత్తాపూర్ సీవరేజీ ప్లాంట్లలో తొలిదశ శాంపిల్ సేకరణను పూర్తి చేసింది. సిటీలోని మరో 15 ఎస్టీపీల నుంచీ శాంపిళ్లను తీసుకోనున్నట్టు సమాచారం. మురుగు నీటిలో కరోనా అవశేషాలు, మనుగడపై ఇప్పటికే బ్రిటన్కు చెందిన క్రాన్ ఫీల్డ్ వర్సిటీ రీసెర్చ్ చేసింది. కరోనా పేషెంట్ల మలం ద్వారా వైరస్ మురుగునీటిలోకి చేరిందని వర్సిటీ సైంటిస్ టులు గుర్తించారు. వైరస్ సోకిన 3 రోజుల్లోనే మలంలో వైరస్ ఆనవాళ్లు కనిపిస్తాయని గుర్తించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ సీవరేజీ ప్లాంట్ లోని మురుగు నీటిలోనూ కరోనా ఆనవాళ్లున్నట్టు ఇటీవల తేలింది.అందుకే సీసీఎంబీ చేస్తున్న స్టడీలో మురుగు నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందని తేలితే.. దానికి తగ్గట్టు చర్యలు తీసుకునే వీలు దొరుకుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ప్రాంతాల వారీగా సేకరించిన శాంపిళ్లను టెస్ట్ చేస్తే వైరస్ వ్యాప్తి ఎంతవరకుంటుందో తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.

పేరేంట్ చనిపోయినా కూడా  ఆడబిడ్డకు ఆస్తిలో వాటా

Latest Updates