సంపదకు సంతోషానికి సంబంధం ఉంటదా?

సంపదకు, సంతోషానికి సంబంధం ఉంటదా? అనడిగితే.. ‘‘పైసలతోనే సంతోషం ఉంటద’’ని కొంతమంది అంటరు. ‘‘లే..లే ఎవలుచెప్పిన్రు? పైసలకు, సంతోషానికి అస్సలు సంబంధమే లేదు’’ అని ఇంకొంతమంది అంటరు. నిజానికి రెండూ కరెక్టే!  కానీ, ఫస్ట్‌‌ దానికే ఎక్కువ ఓట్లు పడ్తయ్‌‌. పైసలు లేకుంటే బతుకు బండి ముందుకుపోవుడే కష్టమైనప్పుడు, ఆకలికి, రోగానికి పైసలే సొల్యూషన్ అయినప్పుడు.. సంపదతో, సంతోషం ముడిపడి ఉన్నట్టేగా? ఇగో, ఇదే కథ అమెరికాలోని  వార్టన్‌‌ స్కూల్‌‌ ఆఫ్‌‌ ది యూనివర్సిటీ ఆఫ్‌‌ పెన్సిల్వేనియా సైంటిస్టుల చేసిన స్టడీలో బయటపడింది.

సంతోషానికి, పైసలకు సంబంధం ఉంది. పైసలు మనిషి సంతోషాన్ని ప్రభావితం చేస్తయ్‌‌. జర ఎక్కువ పైసలు సంపాయించినప్పుడు మనిషి తన జీవితాన్ని తాను కంట్రోల్ చేసుకునే పొజిషన్‌‌కి పోతడు. అది ఒక కాన్ఫిడెన్స్‌‌ని ఇస్తది. అది సంతోషాన్ని పెంచుతది. ‘‘పైసలకు, సంతోషానికి మధ్యన ఉన్న సంబంధం ఏంటిది?’ అని  ఈ స్టడీని లీడ్  చేసిన ప్రొఫెసర్‌‌‌‌ మ్యాథ్యూ కిల్లింగ్స్‌‌వర్త్‌‌  అన్నడు. ఆయన  ‘మనిషి —-– సంతోషం’ అనే అంశం మీద కొన్నేళ్లుగా స్టడీ చేస్తున్నడు. “ఈ ప్రశ్న నన్నే కాదు, ఇతర సైంటిస్టుల్లోనూ ఎప్పుడూ క్యూరియాసిటీ కలిగిస్తది. ప్రతి మనిషి జీవితంలో చాలాసార్లు వేసుకునే ప్రశ్న కూడా ఇదే” అన్నాడాయన.

డేటా కలెక్ట్ చేసిండు

మనుషులు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నరు? అని తెలుసుకోవడానికి ‘‘ట్రాక్ యువర్ హ్యాపీనెస్’’అనే యాప్‌‌ని క్రియేట్ చేసిన్రు. ఇందులో సంతోషానికి సంబంధించిన అనేక రియల్‌‌ లైఫ్‌‌ ప్రశ్నలు ఉంచిన్రు. రోజూ టైం ఉన్నప్పుడు ఇందులో వాళ్ల మూడ్‌‌ని, అనుభవాల్ని షేర్‌‌‌‌ చేయాలని చెప్పిన్రు. ఇట్ల 33 వేల మంది నుంచి 17 లక్షల డేటా పాయింట్స్ కలెక్ట్ చేసింది కిల్లింగ్స్‌‌వర్త్‌‌ టీమ్‌‌. పద్దెనిమిదేళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వాళ్లు ఈ స్టడీలో పాల్గొన్నరు.  డైలీ లైఫ్‌‌లో వాళ్ల ఫీలింగ్స్‌‌ అన్నింటినీ స్టడీ చేసిన్రు.

డేటా మాట విప్పితే..

ఎక్స్‌‌పీరియెన్స్ శాంప్లింగ్‌‌ టెక్నిక్‌‌లో కిల్లింగ్స్‌‌ వర్త్‌‌ డేటాను సేకరించిన్రు. ఈ డేటా ఆధారంగా డబ్బుతో ఆరోగ్యానికి, సంతోషానికి ఉన్న సంబంధాన్ని ఏందని విశ్లేషించిన్రు. ఫైనల్‌‌గా డబ్బు, సంతోషాన్ని ప్రభావితం చేస్తుందని ఈ స్టడీ కన్‌‌ఫర్మ్ చేసి.. ఈ స్టడీ రిజల్ట్స్‌‌ నేషనల్‌‌ అకాడమీ ఆఫ్ సైన్స్‌‌లో రిజల్ట్స్‌‌ పబ్లిష్ చేసిన్రు. ‘‘సంవత్సర ఆదాయం 75 వేల డాలర్లు (5 లక్షల రూపాయలు) దాటినప్పుడు సంతృప్తిని, సంతోషాన్ని ఫీలవుతున్నరు. ఎక్కువ డబ్బున్నప్పుడు జీవితంలో అనుకున్నట్టు బతకడానికి ఎక్కువ ఛాయిస్‌‌లు ఉంటాయి. డబ్బు ఎక్కువ అవకాశాలను ఇస్తుంది. చాలా సమస్యలకు దారి చూపిస్తుంది. దీన్ని కోవిడ్ టైంలో చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నరు’ అని  చెప్పిండు కిల్లింగ్స్‌‌వర్త్‌‌. ఎక్కువ సంపాదన ఉంటే సంతోషం వస్తదని.. ఎక్కువ పైసల కోసం ఓవర్ టైం పనిచేసేటోళ్లు సంతోషంగా లేనట్టు కూడా ఈ  స్టడీలో బయట పడిందని చెప్పిండు. అందుకే, డబ్బు సంతోషాన్ని ఇస్తుంది కదా అని,  మొత్తం ఫోకస్  డబ్బు మీదే పెట్టొద్దు. స్మార్ట్‌‌గా సంపాదించి.. హార్ట్‌‌ఫుల్‌‌గా బతకాలని కిల్లింగ్స్‌‌వర్త్ సలహా ఇచ్చిండు.

Latest Updates