క్షణాల్లో నిశ్చితార్ధం..కుక్కతో ఆస్పత్రికి పరుగులు తీసిన వరుడు

మరికొన్ని క్షణాల్లో నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. కానీ నిశ్చితార్ధం వేడుకలో జరిగిన ఇన్సిడెంట్ తో కాబోయే వరుడు కుక్కతో  ఆస్పత్రికి పరుగులు తీశాడు.

మీరు కుక్కల్ని పెంచుతున్నారా..? అయితే జాగ్రత్త. లేదంటే కొన్ని సమయాల్లో తిప్పలు తప్పవ్.

సౌతాఫ్రికాలో ఓ వ్యక్తికి నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. నిశ్చితార్ధం జరిగే సమయంలో వరుడు కాబోయే వధువకి తొడగాల్సిన ఉంగరాల్ని తీసి పక్కన పెట్టాడు. అప్పుడే ఆ వ్యక్తి పెంపుడు కుక్క పెప్పర్ ఖరీదైన నిశ్చితార్ధపు ఉంగరాన్ని మింగింది. దీంతో వరుడు కుక్క మింగిన ఉంగరాన్ని కక్కించేందుకు సమీపంలో ఉన్న వ్యాలీ ఫామ్ యానిమల్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.  కుక్కకు ఎక్సరే తీయించి కడుపులో ఉంగరం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు..కృత్తిమంగా కుక్కతో వాంతులు చేయించి ఉంగరాన్ని బయటకు తీశారు.

మరోవైపు  కుక్క ఉంగరం మింగిన ఎక్సరేలను ఆస్పత్రి యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఎక్సరే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీనిపై స్పందించిన నెటిజన్లు తమపెంపుడు కుక్కలతో ఫేస్ చేసిన సందర్భాల్ని  గుర్తు చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

My name is Pepper. Do I look a little nauseous? That's because the vet has just given me something to make me vomit! Not…

Posted by Valley Farm Animal Hospital on Monday, February 3, 2020

Latest Updates