పెంపుడు కుక్క కిడ్నాప్ : స్కూటీపై వచ్చి ఎత్తుకెళ్లారు

హైదరాబాద్ : తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడ లో జరిగింది. కుక్కను చాలా డబ్బులు పోసి కొనుక్కున్నామని, ఇష్టంగా పెంచుకున్న కుక్క కనిపించకుండాపోయేసరికి ఫ్యామిలీ మొత్తం బాధలో ఉన్నట్లు తెలిపాడు యజమాని. సీసీటీవీ పుటేజి పరిశీలించిన పోలీసులకు కుక్కను ఓ ముగ్గురు వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

సైనిక్ పురిలో సోమవారం గుర్తు తెలియని ముగ్గురు యువకులు స్కూటీపై వచ్చి ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యిందని తెలిపారు కుషాయిగూడ పోలీసులు. పెంపుడు కుక్కను టింగు అని పిలుస్తామని, ఎవరికైనా కనిపిస్తే దయచేసి చెప్పండి అంటూ ఆవేధన వ్యక్తం చేశాడు యజమాని.

Latest Updates