18 కుక్కలు.. యజమానినే తినేశాయి

కుక్కలంటే విశ్వాసమే కాదు… ఇలా కూడా ఉంటాయి. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది. 57 ఏళ్ల ఫ్రెడ్డీ మ్యాక్ అనే వ్యక్తి కుక్కలను పెంచుతుండే వాడు. అతడి దగ్గర మొత్తం 18 కుక్కలున్నాయి. కుటుంబసభ్యులకు దూరంగా.. సిటీలకు దూరంగా… ఓ ఫామ్ హౌజ్ కట్టుకుని.. అక్కడే కుక్కలను పెంచుకుంటూ ఉంటున్నాడు మ్యాక్. అమెరికాలో కాపలా కుక్కలకు గిరాకీ బాగా ఉంటుంది. ఇతను పెంచుతున్నవి అలాంటివే. ఐతే.. ఇటీవల సడెన్ గా యజమాని మ్యాక్ నుంచి బంధువులకు కమ్యూనికేషన్ కట్ అయింది. విషయం తెల్సుకుని పోలీసుల సహాయంతో ఇంటికొచ్చారు ఫ్యామిలీ మెంబర్స్. ఐతే.. వచ్చీరాగానే అక్కడ జరిగిన సంఘటనే వేరు.

ఆ ఇంట్లో ఎవరూ లేరు. కుక్కల అరుపులు మాత్రమే వినిపించాయి. అక్కడ మ్యాక్ తల వెంట్రుకలు.. 2 నుంచి 5 అంగులాలున్న ఎముకలు మాత్రమే ఉన్నాయి. జరిగిన సంఘటన అర్థం కావడంతో వారికి ఒళ్లు గగుర్పొడిచింది. ఆ కుక్కలే యజమానికి తినేశాయని అర్థమైంది.

మ్యాక్ కొన్నిరోజుల పాటు అనారోగ్యంతో బాధపడ్డాడు. ఐతే.. అనారోగ్యంతో ఇబ్బంది పడి అలాగే చనిపోతే అతడి బాడీని కుక్కలు తిన్నాయా .. లేక కుక్కలే అతడిని చంపేశాయా అన్నది తెలియలేదు. 18 కుక్కల్లో రెండు కుక్కలను ఆ దారినపోయేవాళ్లు చంపేశారనీ… మరో 13 కుక్కలను తామే కాల్చి చంపేశామని పోలీసులు చెప్పారు. మిగిలిన మూడింటిని వేరేవాళ్లకు దత్తత ఇచ్చినట్టు చెప్పారు టెక్సాస్ పోలీసులు.

Latest Updates