రౌండప్ చేసి గురిపెట్టాయి : చిరుతను చంపిన కుక్కలు

చిరుతపులిని చూస్తేనే మనుషులతో పాటు జంతువులు కూడా ఆమడ దూరంలో ఉంటాయి. ఎక్కడ తమను లాక్కెక్కి తింటాయోనని సాటి జంతువులు భయపడతాయి. ఊళ్లో ఉండే కుక్కలు అయితే చిరుతను చూస్తే ఇంకేముందు భయంతో పరుగులు తీయాల్సిందే. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అడవిలో నుంచి ఊరి చివరకు వచ్చిన చిరుతను రౌండప్ చేశాయి కుక్కలు. ఎక్కుడకు కదలనీయకుండా చుట్టూ చేరాయి. అరుపులతో చిరుతకు భయం పుట్టించడమే కాకుండా ఒకదానివెనక ఒకటి వరుసగా కరవడం మొదలుపెట్టాయి.  పాపం చిరుతకు ఇంతకుముందే గాయం అయినట్టుంది. సరిగ్గా నిలబడలేకుండా ఉంది. ఉరుకులు తీయాలనకుంటుంది పడిపోతుంది. కుక్కలు ఒకదాని వెనక ఒకటి కరవడంతో కుక్కుల విషం చిరుతకు ప్రాణాలమీదకు వచ్చింది. చివరకు కుక్కల మధ్యనే ఊపిరి వదిలింది చిరుత.

అలాంటి పరిస్థితుల్లో కుక్కలకు లొంగిపోక తప్పలేదు చిరుతపులి. ఈ సంఘటనను దూరంగా ఉంటూ వీడియో తీసీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. చూసిన వారంతా పాపం చిరుత అంటున్నారు. గుంపులుగా కలిస్తే అది సింహం అయినా..చిరుత అయినా ఏం చేయలేదని కుక్కులు నిరూపించాయని కొంతమంది కామెంట్స్ చేస్తుండగా..గాయపడ్డ చిరుతను కుక్కలు దారుణంగా పీక్కుతిన్నాయంటున్నారు.

Latest Updates