కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి

కరీంనగర్‍, వెలుగు : గొర్రెల కొట్టం పై వీధి కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా హుజు-
రాబాద్ మండలం ఇప్పల నర్సింగపూర్‌‌‌‌లో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గోవిందుల రవీందర్‌‌‌‌కు
చెందిన గొర్రెల కొట్టం పై కుక్కలు దాడి చేసి 20 గొర్రెలను తీవ్రంగా గాయపరచడంతో మృతి చెందాయి. సుమారు రూ. లక్ష మేరకు
నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

Latest Updates