కుక్కల స్వైర విహారం : 40 మందికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 40 మందిని పైగా గాయపరిచాయి. గాయపడ్డవారిని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్కల స్వైరవిహారంతో  ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

స్థానికులు గస్తీ కాస్తూ కుక్కలను తరిమేస్తున్నారు. అధికారులు స్పందించి పిచ్చికుక్కల భారినుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Latest Updates