కరోనాను గుర్తించడానికి కుక్కలు

లండన్: నేరగాళ్ళను పట్టుకోవడానికె వేటకుక్కల్ని ఉపయోగిస్తారని ఇన్నాళ్లు చదువుకున్నాం. బ్రిటన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పై జరుగుతున్న పోరులో జాగిలాలను కూడా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది. ‘జాగిలాలు ఏంటి? వ్యాధులను పట్టుకోవడం ఏంటి?’ అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు బ్రిటన్ డాక్టర్లు. వీటిని ‘మెడికల్ డిటెక్షన్ డాగ్స్’గా పిలుస్తుంటారు. ఆ దేశంలో మలేరియా, పార్కిన్సన్ సహా అనేక ఇతర వ్యాధులను పసిగట్టడంలో జాగిలాలు ఇప్పటికే సక్సెస్ అయాయి. జాగిలాలకు వాసన చూసి, అందులోని గుట్టును రట్టు చేసే విద్య బాగా తెలుసు. ఇప్పుడు ఈ విద్యనే ఆధారం చేసుకుని ఎవరిలోనైనా కరోనా లక్షణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకుంటామని మెడికల్ ఎక్స్​పర్టులు చెప్పారు . ఈ నేపథ్యంలో కొంతమంది మెడికల్ నిపుణులతో ఒక టీం ను లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అనే సంస్థ ఏర్పాటు చేసింది .  ఈ సంస్థ ఆరు వారాల్లోగా ‘మెడికల్ డిటెక్షన్ డాగ్స్’కి కొవిడ్-19ని పసిగట్టే. ట్రైనింగ్ ఇస్తుంది. జాగిలాలు వ్యాధులను గుర్తించే ట్రైనింగ్ ఇవ్వడం ఈ సంస్థకు ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో కేవలం వాసన చూసి వ్యాధులను గుర్తించే విద్యలో జాగిలాలకు ఈ సంస్థ ట్రైనింగ్ ఇచ్చిన అనుభవం ఉంది. ఈ జాగిలాలు  ‘మెడికల్ డిటెక్షన్’లో ఎంత నైపుణ్యం ఉందంటే… మనిషిని వాసన చూసి టెంపరేచర్ రవ్వంత పెరిగినా పట్టేస్తాయి. కరోనా లక్షణాల్లో టెంపరేచర్ పెరగడం కూడా ఒకటన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ను రంగంలోకి దింపడంవల్ల నేషనల్ హెల్త్ సర్వీస్ పై కొంతమేర భారం తగ్గుతుందని మెడికల్ ఎక్స్ పర్టులు అంటున్నారు.

మొదట  ఎయిర్​పోర్ట్​ల దగ్గర డ్యూటీ

ట్రైనింగ్ పూర్తయిన మెడికల్ డిటెక్షన్ జాగిలాలను ఎయిర్​పోర్టుల్లో  దింపుతామని బ్రిటన్ హెల్త్ నిపుణులు చెప్పారు. బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళల్లోనే ఎక్కువగా కరోనా లక్షణాలు బయట పడుతున్నాయన్నారు.

 

Latest Updates