కరోనా శవం.. కుక్కలపాలు!

సగమే కాలిన మృతదేహం
విచారణకు ఆదేశించిన కలెక్టర్

ఆదిలాబాద్, వెలుగు: కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను దహనం చేయడంలో నిరక్ష్ల్యంగా వ్యవహరిస్తుండడంతో అవి కుక్కల పాలవుతున్నాయి. ఆదిలాబాద్లో నాలుగు రోజుల క్రితం కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు లాక్కెళ్లితినడం కలకలం రేపింది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తినాలుగు రోజుల క్రితం కరోనాతో చనిపోయాడు. మృతదేహాన్ని రిమ్స్అధికారులు మున్సిపాలిటీ వారికి అప్పజెప్పారు. మృతదేహానికి నిప్పంటించిన మున్సిపల్ సిబ్బంది వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి తరువాత మంటలు ఆరిపోవడంతో శవం పూర్తిగా కాలలేదు. అలా మిగిలిపోయిన మృతదేహాన్నికుక్కలు కొంత దూరం ఈడ్చుకెళ్లి తిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుక్కలు తినగా మిగిలిన మృతదేహం శనివారం ఉదయం కొందరికి కనిపించడంతో వారు ఫోటోలు, వీడియోలు తీశారు. అది తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని కుక్కలు లాక్కెళ్లడం అంతా ఉత్తదే అని కొట్టిపడేశారు. అయితే ఈ ఘటనపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై పరిశీలన చేయాలని ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి నేతృత్వంలో కమిటీ వేశారు.

For More News..

పిల్లల గొడవ పెద్దదై.. ఒకరి మృతి

కేరళ విమాన ప్రమాద పైలట్ అమ్మను సర్ ప్రైజ్ చేద్దామనుకున్నడు.. కానీ

రామాలయ భూమి పూజను టీవీల్లో చూసిన 16 కోట్ల మంది

Latest Updates