ఓనర్‌ని కాపాడిన కుక్కలు

బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించిన డాగ్స్

వేల్స్ లో మహిళ ప్రాణాలను కాపాడిన జర్మన్ షెపర్డ్స్

ఓ రెండు డాగ్స్ బ్రెస్ట్ కేన్సర్ ను గుర్తించినయట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది నిజం. వాటిని పెంచుకున్న ఓనరే ఈ విషయాన్ని వెల్లడించారు. వేల్స్ దేశానికి చెందిన లిండా మంక్లే (65) కు డాగ్స్ అంటే ఇష్టం. ఆమె నాలుగు ఆల్సేషియన్‌(జర్మన్ షెపర్డ్ )డాగ్స్ ను పెంచుకుంటోంది. వీటిలో ఐదేళ్ల ‘బీ’, దాని మూడేళ్ల బిడ్డ ‘ఇన్యా’ ఉన్నాయి. ఒకరోజు ‘బీ’ ఉన్నట్టుండి లిండా ఎదపైకి దూకింది. చెస్ట్ భాగంలో వాసన చూడడం ప్రారంభించింది. అయితే దాన్ని లిండా లైట్ తీసుకుంది. తరచూ ఇలాగే చేయడంతో ఆమెకు  అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకుంది. టెస్టుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. తర్వాత ‘ఇన్యా’ కూడా చెస్ట్ భాగంలో వాసన చూడడం ప్రారంభించిందని లిండా చెప్పింది. కేన్సర్ ను తొలి దశలోనే గుర్తించడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. కీమోథెరపీ చేయించుకున్న లిండా కేన్సర్ నుంచి కోలుకుంది. మూడుసార్లు కీమోథెరపీ అయిపోయిన తర్వాత డాగ్స్ వాసన చూడడం మానేశాయని లిండా తెలిపింది. తాను పెంచుకున్న డాగ్స్ వల్లే బతికి ఉన్నానని లిండా సంతోషం వ్యక్తం చేస్తోంది. అవి లేకపోతే తాను లేనని అంటోంది. కేన్సర్ విషయంలో తాను పెంచుకున్న డాగ్స్ నే అలెర్ట్ చేశాయని డాక్టర్లకు చెబితే… వారందరూ ఆశ్యర్యపోయారని ‘ఇది నిజంగా అద్భుతం’ అన్నారని లిండా చెప్పింది. డాగ్స్ కు కొన్ని వ్యాధులను గుర్తించే గుణం ఉంటుందని మెడికల్ న్యూస్ టుడే పేర్కొంది. మనిషికి వ్యాధి సోకినప్పుడు కొన్ని వాసనలు వస్తాయని, వాటిని కుక్కలు పసిగడతాయని వెల్లడించింది.

Latest Updates