కుక్కల కోసం కోర్టుకెక్కాడు: భార్య కంటే అవే ప్రాణమట..!

భార్య భర్తలు విడాకులు తీసుకుంటే.. పిల్లలు, ఆస్తి పంపకాలపై వివాదం పెట్టుకున్న కేసులు ఎన్నో చూస్తున్నాం. కానీ.. వీటన్నింటినీ వదిలి ఓ వ్యక్తి తాను ఇష్టంగా పెంచుకున్న 2 కుక్కల కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టి కోర్టుకెక్కాడు. ఈ సంఘటన ఇంగ్లండ్ లో జరుగుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.

వివరాలు:  

ఇంగ్లండ్ కు చెందిన గియారుస్సో తన భార్యతో రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. ఆస్తులు పంచేసుకున్నారు. అయితే.. ఇద్దరు కలిసి పెంచుకున్న 2 కుక్కల్ని భార్య తీసుకెళ్లింది. ఇష్టంగా పెంచుకున్న ఇవ్వాలని గియారుస్సో  భార్యను వేడుకున్నాడు. తనకు కూడా కుక్కలంటేనే ప్రాణం అని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వనని ఆమె  తేల్చడంతో..అతడు కోర్టుకు వెళ్లాడు. వాదనల తర్వాత  వారంలో 2 రోజులు అతడు కుక్కల్ని చూసుకునేందుకు అనుమతినిచ్చింది కోర్టు. మొత్తానికి భార్య కంటే అతడికి పెంచుకున్న కుక్కలే ఎక్కువని నిరూపించుకున్నాడు. అందుకోసం గియారుస్సో రెండేళ్లు లాయర్లకు భారీ ఫీజు చెల్లించాడట. కుక్కల్ని వారిద్దరూ ప్రాణంగా ప్రేమించడమే ఇందుకు కారణంగా చెప్పారు లాయర్లు.

SEE ALSO: ‘ఎన్ని అడ్డదారులు తొక్కి సీఎం అయ్యాడో మాకు తెలుసు’

కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ కాలేదు

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

 ఐపీఎల్ మ్యాచులు.. టైం తెలుసా..?

Latest Updates