మురికి కాలువలో చిన్నారి : కాపాడిన కుక్కలు

dogs-save-new-born-girl-in-haryana

మనుషుల కంటే కుక్కలకే విశ్వాసం ఎక్కువ అనే మాటలకు ఈ సంఘటనే ఎక్సాంఫుల్. ఓ మురికి కాలువ పక్కన చిన్నిరి కేకలు వినిపిస్తున్నాయి.  అటుగా వెళ్తున్న వారికి తెలియజేసిన కుక్కలు  చిన్నారని రక్షించాయి. ఈ హృదయ విదారక ఘటన హరియాణాలోని కైతాల్‌ జిల్లాలో జరిగింది.

కైతాల్‌ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఓ మహిళ అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువును ప్లాస్టిక్‌ కవర్లో చుట్టి మురికి కాలువలోకి విసిరేసింది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్నారి అరుపులను పసిగట్టిన రెండు కుక్కలు వెంటనే కాలువలోకి దూకి చిన్నారిని నోటకరుచుకుని గట్టుమీదకు తీసుకొచ్చాయి. గట్టిగా అరుస్తూ అటుగా వెళ్తున్న వారికి చిన్నారి గురించి తెలిపే ప్రయత్నం చేశాయి. కుక్కల అరుపుతో కొందరు అక్కడకు వెళ్లి చూడగా కవర్లో చిన్నారి ఏడుస్తూ కన్పించింది. దీంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని హస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం చిన్నారికి  హస్పిటల్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుక్కలు చేసిన ఈ మంచిపనికి స్థానికంగా సానుభూతి ఏర్పడింది. మనుషుల కంటే కుక్కలే నయ్యం అంటున్నారు.

Latest Updates