మొదటి రోజు షేక్ హ్యాండ్..రెండో రోజు రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇవాళ మండలికి గైర్హాజరైన ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు పంపించారు. అమరావతి రాజధాని విడిపోతున్నందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనన్నారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ప్రోత్సహించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. డొక్కా రాజీనామా టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

స్పెషల్ షెషన్స్ స్టార్ట్ చేసిన మొదటి రోజున శాసన మండలిలో డొక్కాను పలకరించారు సీఎం జగన్. రెండవ రోజు అటెండ్ కాకుండా రాజీనామా చేయడంతో  డొక్కా వైసీపీలోకి వెళతారా? అనే ప్రచారం జరుగుతోంది. మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా మండలికి గైర్హాజరయ్యారు.

see more news

దకొండేళ్ల ప్రేమ కోసం మతం మారాను.. అన్యాయం జరిగింది

హైదరాబాద్ యువత అప్పులు ఎక్కువ చేస్తుండ్రు

టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి అనిల్ సవాల్

Latest Updates