50 మంది కార్మికులు చనిపోతే మౌనంగా ఉండాలా?

వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రభుత్వం 50 మందిని హత్య చేసిందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్..50 మంది కార్మికులు చనిపోతే మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలసీ విధానాలు సరిగా లేకపోతే ప్రజలను చంపేయడంతో సమానమన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే చేస్తున్న జగన్ ను ఏమని పిలవాలో 150 మంది ఎమ్మెల్యేలు చెప్పాలన్నారు. బొత్స లాంటి నేతలకు ఆకలి బాధలు తెలుసా అని అన్నారు.

1400 మంది చనిపోయారని ఓదార్పు యాత్రతో వాళ్ల ఇంటికి వెళ్లిన జగన్ చనిపోయిన కార్మికుల ఇళ్లకు ఎందుకు వెళ్లరని ప్రశ్నించారు పవన్? ఓట్ల కోసం సొంత డబ్బు లు ఇచ్చిన నేతలు ప్రభుత్వ సొమ్మును కార్మికులకు ఎందుకు ఇవ్వరని అన్నారు.

 

 

 

Latest Updates