యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన ఫస్ట్ ఆస్ట్రియన్

ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ రష్యాకు చెందిన డేనియల్ మెద్వెదేవ్‌ను వరుస సెట్లలో ఓడించి యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అమెరికాలోని ఆర్థర్ ఆషే స్టేడియంలో 56 నిమిషాల పాటు జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో థీమ్ 6-2,7-6,7-6 తేడాతో మెద్వెదేవ్‌ను ఓడించాడు. దాంతో థీమ్.. జర్మన్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో ఫైనల్లో పోటీపడనున్నాడు. వీరిద్దరికి ఫైనల్ ఆడటం తొలిసారి.

డొమినిక్ థీమ్ యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరడం తొలిసారి. అంతేకాకుండా.. ఆస్ట్రియా నుంచి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి వ్యక్తి డొమినిక్ కావడం విశేషం. ఇక మరో ఫైనలిస్ట్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ కూడా యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరడం తొలిసారి. అలెగ్జాండర్ జ్వెరెవ్ 3-6, 2-6, 6-3, 6-4, 6-3 తేడాతో పాబ్లో కారెనో బస్టాపై విజయం సాధించి.. ఫైనల్‌కు చేరుకున్నాడు. అయితే జర్మన్‌కు చెందిన ఒక ఆటగాడు యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరడానికి 26 ఏళ్లు పట్టింది. గతంలో జర్మనీకి చెందిన మైఖేల్ స్టిచ్ 1994లో ఈ ఘనతను సాధించాడు. దాంతో యూఎస్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్న రెండో జర్మన్ వ్యక్తిగా జ్వెరెవ్ నిలిచాడు.

ఆదివారం జరిగే యూఎస్ ఓపెన్ ఫైనల్లో థీమ్ మరియు జ్వెరెవ్‌ టైటిల్ కోసం తలపడనున్నారు.

For More News..

వీడియో: సీఎం కార్టూన్ వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేసినందుకు రిటైర్డ్ ఆర్మీ అధికారిపై దాడి

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్

వీడియో: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ముందే కొట్టుకున్న పార్టీ లీడర్లు

వీడియో: నన్ను నా భర్తతో పాటే దహనం చేయండంటూ షాపింగ్ మాల్‌పై నుంచి దూకిన నవవధువు

Latest Updates