
నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించగా..ట్రంప్ ఓటమి పాలయ్యారు.
ఈ ఎన్నికల్లో ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వారి విజయాన్ని ఖరారు చేయరు. అధ్యక్ష పదవి ఎవరికి దక్కాలో ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఓట్లలో అధ్యక్ష పదవి పోటీ చేసే అభ్యర్ధికి మొత్తం 538 ఓట్లలో 270 వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు.
అయితే అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన ట్రంప్ కు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు 232పోలవ్వగా జోబైడన్ కు 306 ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన జోబైడన్ 2021 జనవరి 20న అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు.
కానీ ట్రంప్ మాత్రం ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల పోలింగ్ లో అవకతవకలు జరిగాయని, తనకు న్యాయం చేయాలని అప్పటి వరకు వైట్ హౌస్ ను వీడేదిలేదంటూ పట్టబట్టారు.
ఈ నేపథ్యంలో థ్యాంక్స్ గివింగ్ హాలిడే సందర్భంగా వైట్ హౌజ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లతో విజయం సాధించిన బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత..మీరు వైట్ హౌస్ ను వదిలేస్తారా..? అన్న మీడియా మిత్రుల ప్రశ్నలకు ట్రంప్ స్పందించారు. ఖచ్చితంగా వైట్ హౌస్ ను వదిలేస్తా. కానీ నాదొక కండీషన్. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో ఫ్రాడ్ జరిగిందని ఒప్పుకోవాలన్నారు. కానీ అది కొంచెం కష్టమేనంటూ ట్రంప్ తనదైన స్టైల్లో రిప్లయ్ ఇచ్చారు.