టిక్ టాక్ బ్యాన్ చేసిన అమెరికా

అమెరికా అన్నంత పని చేసింది. టిక్ టాక్ ను బ్యాన్ చేస్తామని ట్రంప్ గత వారం పేర్కొన్నారు. చెప్పినట్లుగానే అమెరికాలో టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ నిషేధిస్తున్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన వచ్చే 45 రోజుల్లో అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ఆయన జారీ చేశారు. టిక్ టాక్ తో పాటు.. వుయ్ చాట్ పైనా అమెరికా నిషేధం విధించింది. అమెరికా నిబంధనల ప్రకారం టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తో పాటు వుయ్ చాట్ పై కూడా నిషేధం విధిస్తున్నట్లు అమెరికన్ కాంగ్రెస్ నాయకులకు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. చైనాకు సంబంధించిన యాప్ లను వివిధ దేశాలు ఒక్కొక్కటిగా బ్యాన్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో చైనాకు చెందిన చాలా యాప్స్ బ్యాన్ అయ్యాయి.

For More News..

రైతు బీమాకు రూ.1,141 కోట్లు రిలీజ్

ఇక నుంచి ఆర్టీసీ పెట్రోల్‌ బంకులు

ఆన్‌లైన్ క్లాసుల కోసం స్టూడెంట్లకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం

Latest Updates