పుల్వామా దాడి భయానకం.. ప్రకటన సిద్ధం చేస్తున్నాం : ట్రంప్

పుల్వామా ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. వైట్ హౌజ్ లోని ఓవల్ ఆఫీస్ లో మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు ట్రంప్. ఇది భయంకరమైన దాడి అన్నారు. ఇండియా, పాకిస్థాన్ స్నేహభావంతో ఉండటంపై దృష్టిపెట్టాలన్నారు.  దాడిపై పలు కోణాల్లో నివేదికలు అందుతున్నాయని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రికత్తలు తలెత్తవచ్చనీ…  భారత్, పాక్ మధ్య మారుతున్న పరిస్థితులు, పరిణామాలను గమనిస్తున్నానని చెప్పారు. అన్నీ పరిశీలించి అమెరికా దీనిపై ఓ విధానపరమైన ప్రకటన చేస్తుందన్నారు.

ఇండియా ఆత్మ రక్షణ పోరాటానికి ఇప్పటికే మద్దతిచ్చారు అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్ బోల్టన్. ఉగ్రదాడికి కారణమైన వారు ఎవరైనా పాకిస్థాన్ శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు.

Latest Updates