వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

ఇండియా బాగుంది.. ట్రిప్ సక్సెస్ ఫుల్: ట్రంప్

వాషింగ్టన్‌లో ల్యాండయ్యాక ట్వీట్

వాషింగ్టన్: ‘ఇండియా చాలా బాగుంది. నా ట్రిప్ సక్సెస్ ఫుల్‌గా పూర్తయింది’ అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం ట్వీట్ చేశారు. రెండు రోజుల ఇండియా టూర్ ముగించుకుని వాషింగ్టన్‌లో ల్యాండయ్యాక ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. అంతకుముందు మంగళవారం రాత్రి ఢిల్లీలో ట్రంప్‌ను సాగనంపాక ప్రధాని మోడీ ఆయనకు ట్విట్టర్లో థ్యాంక్స్ చెప్పారు. ఇండియా, అమెరికా దోస్తానా రెండు దేశాల ప్రజలతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనం ఉంటుందని ట్వీట్ చేశారు. ట్రంప్ ఇండియా టూర్ రెండు దేశాల బంధాన్ని సరికొత్త మార్గానికి దారితీస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

థాంక్యూ ఇండియా: ఇవాంక
తండ్రితో పాటు మన దేశంలో పర్యటించిన ఇవాంక ట్రంప్.. థాంక్యూ ఇండియా అంటూ ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాజ్ మహల్ ముందు దిగిన ఫొటోతో ఆమె ఈ పోస్టు పెట్టారు. ఈ టూర్ విశేషాలను ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా ఫాలోవర్లకు ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చారు. టూర్ ముగించుకుని బుధవారం అమెరికా చేరుకున్న తర్వాత ఇండియాకు థాంక్స్ చెప్పారు.

Latest Updates