ప్లాస్మాను డొనేట్‌ చేయండి: మౌలానా సాద్‌ కందల్వీ

  • కరోనాను జయించిన వారికి మౌలానా రిక్వెస్ట్‌

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తబ్లిగి జమ్మాత్‌ లీడర్‌‌ మౌలానా సాద్‌ కందల్వీ రిక్వెస్ట్ చేశారు. కరోనా బారిన పడిన వారికి రక్తంలోని ప్లాస్మా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తన అనుచరులకు ఆయన ఒక లెటర్‌‌ రాశారు. తనతో పాటు మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిలో కొంత మందికి కరోనా పరీక్షలు చేస్తే నెగటివ్‌ వచ్చిందని, అయినప్పటికీ క్వారంటైన్‌లో ఉన్నామని అన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి సరైన ట్రీట్‌మెంట్‌ అందించడంతో చాలా మంది కోలుకున్నారని, వాళ్లంతా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులంతా ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకొని సోషల్ డిస్టెంసింగ్‌ పాటించాలని అన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ తబ్లిగి జమాత్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు కందల్వీపై హత్యయత్నం కేసు నమోదు చేయగా.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన ఎంక్వైరీకి సహకరిస్తానని ఢిల్లీ పోలీసులకు లెటర్‌‌ రాశారు.

Latest Updates