వాట్సాప్ స్టేట‌స్ కి స్పందించిన దాత‌లు- క్యాన్స‌ర్ పేషెంట్ కి రూ.50 వేలు సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా: క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న ఐదేళ్ల చిన్నారికి మేముసైతం అంటూ త‌మ‌వంతు సాయం అందించి మంచి మ‌న‌సు చాటారు దాత‌లు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా, సూరేప‌ల్లి గ్రామానికి చెందిన కాసుల వ‌రుణ్ సాయి (5) గ‌త కొన్ని నెల‌లుగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్నాడు. విష‌యం తెలుసుకున్న కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్ త‌న వంతు సాయంగా రూ.5 వేలు చేయ‌డ‌మే కాకుండా.. అత‌డి వాట్సాప్ స్టేట‌స్ లో ఓ మెసేజ్ పెట్టాడు. బాలుడికి మీ వంతు సాయం కోరుతున్నా.. క‌నీసం 100 రూపాయ‌లైనా ఇవ్వొచ్చంటూ కోరాడు.

దీంతో మాన‌వ‌తా దృక్ప‌దంతో ప‌లువురు తోచిన సాయాన్ని శివానంద్ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫ‌ర్ చేశారు. పోలీసులు కూడా త‌మ‌వంతు సాయ చేయ‌గా.. మొత్తం రూ.50 వేలు జ‌మ చేశాడు. ఈ మొత్తాన్ని మంగ‌ళ‌వారం పోలీసుల‌తో క‌లిసి వ‌రుణ్ సాయి త‌ల్లిదండ్రుల‌కు అంద‌జేశాడు ఎంపీటీసీ శివానంద్. సాయం చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు అని.. మంచి ప‌ని చేయ‌డానికి మంచి మ‌న‌సుంటే చాల‌ని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ లీడ‌ర్.

Latest Updates