కరోనా బారినపడ్డ పోలీసులు అధైర్యపడవద్దు: సీపీ అంజనీకుమార్

కరోనా బారినపడ్డ పోలీసులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. కరోనాను జయించి ఇవాళ విధుల్లో చేరిన 43 మంది  మహిళా పోలీస్ అధికారులను అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలతో పాటు సర్టిఫికెట్లు అందించారు. అంతకు ముందు కరోనాను జయించిన ఆ మహిళా పోలీసులకు ఘన స్వాగతం పలికిన సీపీ… మహిళ పోలీసులు కరోనా తో పురుషులతో సమానంగా పోరాడుతున్నారన్నారు. మహిళ అధికారులు మునుపటిలా కాకుండా అన్ని డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారని తెలిపారు. విధుల్లో చేరిన మహిళ పోలీస్ అధికారులు విధిగా మాస్క్స్ ధరించడంతో, సానిటైజర్స్ యూజ్ చేయడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మన దరికి చేరదన్నారు సీపీ అంజనీకుమార్.

Latest Updates