ఐక్యత చాటండి, దేశాన్ని బలపరచండి… ప్రజలకు భగవత్ పిలుపు

నాగ్ పూర్: కరోనా వైరస్ ( కోవిడ్ – 19 ) విజృంబిస్తున్న కాలంలో దేశ ప్రజలు ఐక్యతను చాటాలని అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆదివారం సాయంత్రం నాగ్ పూర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన.. కరోనాతో ఇబ్బందులు పడుతున్న అందరికీ తమ స్వయం సేవక్‌లు సహాయం చేస్తున్నారని అన్నారు. దేశం త్వరగా ఆర్థికంగా ఎదగడానికి ప్రతీ ఒక్కరూ దేశీయ వస్తువులను కొనాలని సూచించారు. దేశాన్ని విచ్చిన్నం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని వారికి ప్రజలందరూ దూరంగా ఉండాలని చెప్పారు.

కరోనా మహమ్మారిని తేలికగా తీసుకుని కొందరు తప్పు చేశారని అయితే ఆ కొందరి వలన ఆ సమాజాన్ని నిందించవద్దని అన్నారు భగవత్.  భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం చేస్తున్న సూచనలను కొందరు కావాలనే పెడచెవిన పెట్టి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నరని ఆయన అన్నారు… అది సరికాదని చెప్పారు.. దేశం, ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే కొందరు మాత్రం ఇందులో లబ్ధిపొందడానికి ఓ వర్గం వారిని రెచ్చకొడుతున్నారని చెప్పారు. జూన్ చివరి వరకు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలనన్నింటిని ఆపేసినట్లు చెప్పారు.

మహారాష్ట్రలోని పాల్గర్‌లో ఇద్దరు సాదువులను కొందరు దుండగులు కట్టెలతో కొట్టి చంపిన ఘటనను  ప్రస్తావించారు భగవత్. సాదువులు శాంతిని బోధించే వ్యక్తులని అన్నారు. అలా వారిపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Latest Updates