సబ్సీడీల కోసం వ్యాపారాలు చేయోద్దు: కేటీఆర్

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. గచ్చిబౌలిలోని ISBలో సీఎం ST ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీంను ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. వంద మంది ఎస్టీ ఔత్సాహికులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.

ఎక్కువ ఉద్యోగాలు కల్పించేవి చిన్న, మధ్య తరహా సంస్థలేనన్నారు. పెద్ద పరిశ్రమలు ఉండాలని, అదే సమయంలో చిన్న పరిశ్రమలు కూడా అవసరమేనన్నారు. అయితే సబ్సీడీల కోసం వ్యాపారాలు చేయోద్దన్నారు కేటీఆర్. ఇష్టపడ్డ దాని కోసం కష్టపడాలని సూచించారు. ప్రతి పారిశ్రామిక పార్కుల్లోనూ రిజర్వేషన్లు ఉన్నాయని, మహిళా ప్రత్యేక పారిశ్రామిక పార్కులను ఉపయోగించుకోవాలని  సూచించారు. పారిశ్రామిక హెల్త్‌ క్లినిక్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్.

Latest Updates